అధ్యాత్మ సంకీర్తన
రేకు: 11-5
సంపుటము: 1-71
రేకు: 11-5
సంపుటము: 1-71
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కన్నడగౌళ
| ఎంతసేసినా నెడయకే పోయ ముంతలోని నీట మునిఁగి లేచుట | ॥ఎంత॥ |
| ఉట్టిపై చెరలాట మూరఁ బొత్తులకూడు పట్టుచాలని కొమ్ము(మ్మ?) బహునాయకము వెట్టిమోపరిలాగు వెఱ్ఱివోయిన పోక నట్టింటి వైరంబు నగుఁబాటు బ్రదుకు | ॥ఎంత॥ |
| రాకపోకలచేత రాఁగిన పెనుఁబుండు వాకులేని వరము వలవని వలపు యేకాలము వేంకటేశుని కృపలేక ఆకడీకడ నడయాడెడి నడపు | ॥ఎంత॥ |


