అధ్యాత్మ సంకీర్తన
రేకు: 12-2
సంపుటము: 1-73
రేకు: 12-2
సంపుటము: 1-73
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
| పోరొ పోరొ యమ్మలాల బొమ్మలాటవారము యీరసాన మమ్ము నిట్టే యేమి సేసేరు | ॥పోరొ॥ |
| ఊరులేని పొలమేర వొడలు మోచుకొని నేము తేరదేహ మెక్కుకొని తిరిగేము వారువీరనుచు వట్టివావులు సేసుక లేని పేరు పెట్టుకొని లోలోఁ బిరువీకులయ్యేము | ॥పోరొ॥ |
| బుద్దిలేని బుద్దితోడ పొందు సేసుకొని వట్టి- యెద్దుబండికంటి [1]సంది నీఁగేము నిద్దురలో తెలివంటా నీడలోని [2]యెండంటా వుద్దువుద్దులై లేనివొద్దిక నున్నారము | ॥పోరొ॥ |
| మాటులేని మాటు దెచ్చి మరఁగు వెట్టుక వట్టి మేటానమేట్లవలె మెరసేము గాటమైన తిరువేంకటగిరినిలయుని నాటకమే నిజమని నమ్మిక నున్నారము | ॥పోరొ॥ |
[1] ‘సంది’ ఇది పూ.ము.న తప్పినది. రేకులో నున్నది.
[2] ‘యండ’ అని రేకు.


