అధ్యాత్మ సంకీర్తన
రేకు: 155-2
సంపుటము: 2-258
రేకు: 155-2
సంపుటము: 2-258
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
| శ్రీపతి నీవు సిద్ధించుటే సిద్ధులన్నియు పైపై నీశరణమే పరమపదంబు | ॥పల్లవి॥ |
| పరమాత్మునిపై నాత్మ ప్రవేశింపఁజేయుటే పరికింపఁ బరకాయప్రవేశము గరిమ నాహృదయాకాశమునఁ దలఁచుటే గిరవై యబ్బినయట్టి ఖేచరత్వము | ॥శ్రీప॥ |
| మంచి పరమహంసనామము ప్రాణులచే వింట చంచుల వినేటి దూరశ్రవణము కాంచి నీరూపము ఆరుకమలాల ధ్యానించుట యెంచఁగ దూరగమన మింటిలో నౌట | ॥శ్రీప॥ |
| సావధానమె లోచూపు సర్వథా నిన్నుఁ జూచుట తావులనే అనిమిషత్వము చేరుట శ్రీవేంకటేశ్వర నీసేవకుఁడై నిలుచుటే వేవేలు తత్త్వజ్ఞానవిధుల నిలుచుట | ॥శ్రీప॥ |


