అధ్యాత్మ సంకీర్తన
రేకు: 155-3
సంపుటము: 2-259
రేకు: 155-3
సంపుటము: 2-259
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
| అంతరంగములో నున్న హరియే గతిగాక చింతించి మొక్కితేఁ దానే చేకొని రక్షించును | ॥పల్లవి॥ |
| పుట్టించిన కర్మమే పోషించకుండునట బెట్టుగా మనసే మఱపించునట పట్టైన మేనే ఆసల బతిమాలింపించునట చుట్టములెవ్వరు యెంచి చూచినఁ బ్రాణికిని | ॥అంత॥ |
| పక్కన విత్తినభూమి పంట వండకుండునట యెక్కడా మాయే భ్రమయింపించునట అక్కరతోఁ జేసిన పుణ్యమే కట్టివేసునట దిక్కు దెస యెవ్వరు యీ దేహిఁ గరుణించను | ॥అంత॥ |
| ఆసలఁ బెట్టే పాయమే అటమటమౌనట సేసే సంసారమే జ్ఞానిఁ జేయునట వేసరక యింతకూ శ్రీవేంకటేశు డేలికట వెూసపుచ్చేవారెవ్వరు ముదమే జీవునికి | ॥అంత॥ |


