అధ్యాత్మ సంకీర్తన
రేకు: 155-5
సంపుటము: 2-261
రేకు: 155-5
సంపుటము: 2-261
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేవగాంధారి
| అన్నిటికి మూలమని హరి నెంచరు పన్నిన మాయలో వారు బయలు వాఁకేరు | ॥పల్లవి॥ |
| ప్రకృతిబోనుల లోపలఁ జిక్కి జీవులు అకట చక్కనివార మనుకొనేరు సకలపుణ్యపాపాల సంది జన్మములవారు వెకలి సంసారాలకే వేడుకపడేవారు | ॥అన్ని॥ |
| కామునియేట్ల దిగఁగారేటి దేహులు దోమటి తమబదుకే దొడ్డదనేరు పామిడి కోరికలకు బంట్లైనవారలు గామిడితనాలఁ దామే కర్తలమనేరు | ॥అన్ని॥ |
| యితరలోకాలనెడి యేఁతపుమెట్ల ప్రాణులు కతల వెూక్షమార్గము గంటిమనేరు తతి నలమేల్మంగపతి శ్రీవేంకటేశ్వర మతకాన నున్నవారు మారు మలసేరు | ॥అన్ని॥ |


