అధ్యాత్మ సంకీర్తన
రేకు: 169-1
సంపుటము: 2-333
రేకు: 169-1
సంపుటము: 2-333
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేవగాంధారి
| ఏపొద్దూ నీచేఁతలెల్లా యెదుటనే కానవచ్చీ వీఁపు గానరాఁగా దాఁగే విద్య నీది గాక | ॥పల్లవి॥ |
| పుట్టిన మెకానకుఁ బూరి మేయ నేరిపిరా అట్టె పిల్లలఁ బెట్ట నటు నేర్పిరా చుట్టి నీళ్లున్నచోటు సోదించ నేరిపిరా మట్టులేని దింతా నీమాయ యింతేకాక | ॥ఏపొ॥ |
| తీవెలకుఁ జుట్టి చుట్టి దిక్కులఁ బాఁక నేరిపిరా తావులఁ దతికాలానఁ బూవ నేరిపిరా వేవేలు పక్కొమ్మలు వెసఁ బెట్ట నేరిపిరా యేవలఁ జూచినా నీమహిమ లింతేగాక | ॥ఏపొ॥ |
| కోరి పక్షులు కొరులు గూండ్లువెట్ట నేరిపిరా సారె జాతియ్యాహారాలచవి నేర్పిరా యీరీతి శ్రీవేంకటేశ యిన్నియు లోకములోన చేరి నీవు సేసిన సృష్టి యింతే కాక | ॥ఏపొ॥ |


