అధ్యాత్మ సంకీర్తన
రేకు: 172-2
సంపుటము: 2-351
రేకు: 172-2
సంపుటము: 2-351
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
| పనిగొన నేరిచితే పాపమే పుణ్యమౌను నినుఁ గొలిచేయట్టి నీసేవకులకు | ॥పల్లవి॥ |
| మనసు చంచలమైనా మరి నిన్నుఁ దలఁచితే జనులకు నిహపరసాధనమౌను తనువు హేయమైనా తగ నిన్నుఁ గొలిచితే పనివడి యంతలోనే పవిత్రమౌను | ॥పని॥ |
| కర్మము బంధకమైనా కమ్మి నీసొమ్ముచేసితే- నర్మిలి మోక్షమియ్య నాధారమౌను మర్మము కోరికయైనా మహి నీభక్తికెక్కితే ధర్మములకుఁ బరమధర్మము దానౌను | ॥పని॥ |
| జగమెల్ల మాయయైనా సరి నీకే శరణంటే పగటున నదే తపఃఫలమౌను అగపడి శ్రీవేంకటాధిప నన్నేలితివి మిగులా నిహమైనా మించి పరమౌను | ॥పని॥ |


