అధ్యాత్మ సంకీర్తన
రేకు: 172-6
సంపుటము: 2-355
రేకు: 172-6
సంపుటము: 2-355
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాట
| వాఁడె వో ప్రహ్లాదవరదుఁడు వాఁడె వో భక్తవత్సలుఁడు | ॥పల్లవి॥ |
| కోర దవడలతోడ కోటి సూర్యతేజముతో హారకేయూరాది భూషణాంబరాలతో చేరి బ్రహ్మాదులెల్లాను సేవలు సేయఁగాను మేర మీరిన శిరుల మేడలో నున్నాఁడు | ॥వాఁడె ॥ |
| తెల్లని మేనితోడ తీగెనవ్వులతోడ చల్లని గంధముల వాసనలతోడ పెల్లుగా నారదాదులు పేరుకొని నుతించఁగా వెల్లవిరిఁ గొలువై వేడుక నున్నాడు | ॥వాఁడె ॥ |
| సంకుఁజక్రముల తోడ జంట పూదండలతోడ పొంకపు నానావిధ భోగములతో అంకపు శ్రీవేంకటాద్రి నహోబలమునందు అంకెలనే పొద్దూ నెలవై తానున్నాఁడు | ॥వాఁడె ॥ |


