అధ్యాత్మ సంకీర్తన
రేకు: 174-1
సంపుటము: 2-362
రేకు: 174-1
సంపుటము: 2-362
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| ఆతనిమూలమే జగమంతా నిది ఆతుమలో హరి కీలు అయివుండుఁ గాని | ॥పల్లవి॥ |
| మచ్చరము లేకున్నను మనసే రామరాజ్యము వచ్చినట్టె వచ్చితేను వలపే చవి యెచ్చుకుందు లేకున్న నెక్కడైనా సుఖమే యిచ్చకుఁడై హరి తన కియ్యవలెఁ గాని | ॥ఆత॥ |
| నెట్టుకొని నడచితే నిజమే మూలధనము పట్టినదే వ్రతమైతే భవమే మేలు జట్టిగా నొనగూడితే సంసారమే ఫలము యిట్టి హరి దనకు నియ్యవలెఁ గాని | ॥ఆత॥ |
| చెప్పినట్లు సేసితేను చేరి దేహమే చుట్టము తప్పులు లేనిదియైతే ధర్మమే సొమ్ము చొప్పున హరిదాసులు సోదించి చూచిన దిది యెప్పుడు శ్రీవేంకటేశుఁ డియ్యవలెఁ గాని | ॥ఆత॥ |


