Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 174-4
సంపుటము: 2-365
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
కేశవ నారాయణ కృష్ణ గోవింద ముకుంద
మూశిన ముత్తెమువలె మొక్కేము నీకు
॥పల్లవి॥
నెమ్మిఁ జక్రాయుధుఁడవు నీవు గల వటు గాన
పమ్మి మాకు నెన్నఁడును భయమే లేదు
యిమ్ముల లక్ష్మిపతివి యేలిక వైతివి గన
సమ్మతి మాకు సర్వసంపదలు గలవు
॥కేశ॥
పుట్టించినవాఁడవు భూధవుఁడ వటు గన
దట్టముగ నెంచగఁ బదస్థుఁడ నేను
తొట్టి కరిరాజవరదుఁడ నీవే దిక్కు గన
గట్టిగా నాకోరిక లిక్కడ ఫలియించెను
॥కేశ॥
గురువవు గొల్లలకు గోవింధరాజవు గన
నిరంతరమునుఁ బాఁడి నిండెను మాకు
చిరంతనదేవుఁడవు శ్రీవేంకటేశ్వర వీవు
పరము నిహము మాకు బలువుగాఁ గలిగె
॥కేశ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము