అధ్యాత్మ సంకీర్తన
రేకు: 175-4
సంపుటము: 2-372
రేకు: 175-4
సంపుటము: 2-372
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
| గతులన్ని ఖిలమైన కలియుగమందును గతి యీతఁడే చూపె ఘనగురుదైవము | ॥పల్లవి॥ |
| యీతనికరుణనేకా యిల వైష్ణవులమైతి- మీతనివల్లనే కంటి మీతిరుమణి యీతఁడేకా వుపదేశ మిచ్చె నష్టాక్షరిమంత్ర- మీతఁడే రామానుజులు యిహపరదైవము | ॥గతు॥ |
| వెలయించె నీతఁడేకా వేదపు రహస్యములు చలిమి నీతఁడే చూపె శరణాగతి నిలిపినాఁ డీతఁడేకా నిజముద్రధారణము మలసి రామానుజులే మాటలాడే దైవము | ॥గతు॥ |
| నియమము లీతఁడేకా నిలిపెఁ బ్రపన్నులకు దయతో మోక్షము చూపెఁ దగ నీతఁడే నయమై శ్రీవేంకటేశు నగ మెక్కేవాకిటను దయఁజూచీ మమ్ము నిట్టే తల్లితండ్రి దైవము | ॥గతు॥ |


