అధ్యాత్మ సంకీర్తన
రేకు: 175-6
సంపుటము: 2-374
సంస్కృతకీర్తన
రేకు: 175-6
సంపుటము: 2-374
సంస్కృతకీర్తన
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
| డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం మీనకూర్మ వరాహ మృగపతి అవతారా | ॥పల్లవి॥ |
| మీనకూర్మ వరాహ మృగపతి అవతారా దానవారే గుణశౌ రే ధరణిధర మరుజనక | ॥డోలా॥ |
| వామన రామ రామ వరకృష్ణ అవతార శ్యామలాంగా రంగ రంగా సామజవరద మురహరణ | ॥డోలా॥ |
| దారుణ బుద్ధ కలికి దశవిధ అవతారా శీరపాణే గోసమాణే శ్రీవేంకటగిరికూటనిలయ | ॥డోలా॥ |


