అధ్యాత్మ సంకీర్తన
రేకు: 176-5
సంపుటము: 2-379
రేకు: 176-5
సంపుటము: 2-379
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| మొక్కరె మొక్కరే మీరు ముందు ముందే జయ లిడి దక్కి శ్రీవేంకటేశుఁడే తానైన దేవునికి | ॥పల్లవి॥ |
| కరములు వే యవే కరములును భయం- కరనఖాయుధములు కడాఁలే వనే సిరి దొడపై నదె సింహపునెమ్మో మదే నరరూపు సగమదె నరసింహునికి | ॥మొక్క॥ |
| వంకరకోరలవె వజ్రపు దంతము లవె సంకునుఁజక్రము నిరువంకలా నవె జంకెల నేత్రము లవె జడలు మూఁపున నవె అంకె నభయహస్తము అదె నరహరికి | ॥మొక్క॥ |
| నిక్కినకర్ణము లవె నీలిమచ్చవుర మదె చుక్కల మొలపూసల నొక్కరూ పదె తొక్కినపాపము లవె తోడనే శ్రీవేంకటాద్రి పక్కెర నరసింహపు ప్రళయసింహునికి | ॥మొక్క॥ |


