అధ్యాత్మ సంకీర్తన
రేకు: 15-2
సంపుటము: 1-90
రేకు: 15-2
సంపుటము: 1-90
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| అక్కడ నాపాట్లువడి యిక్కడ నీపాటు పడి కుక్కనోరి కళాసమై కొల్లఁబోయ బతుకు | ॥అక్కడ॥ |
| ఎండచేత నీడచేత నెల్లవాఁడు నిట్లానే బండుబండై యెందుఁ గడపల గానక వుండగిలి నరకాల నుడుకబోయెద మింక వండఁ దరిగిన కూరవలెనాయ బతుకు | ॥అక్కడ॥ |
| పంచమహాపాతకాల బారిఁ బడి భవములఁ దెంచి తెంచి ముడివేయ దీదీపులై పొంచిన యాసలవెంటఁ బొరలఁబోయెద మింక దంచనున్న రోలిపిండి తలఁపాయ బతుకు | ॥అక్కడ॥ |
| యీదచేత వానచేత నెల్లవాఁడు బాయని బాదచేత మేలెల్ల బట్టబయలై గాదిలివేంకటపతిఁ గానఁగఁ బోయెద మింక బీద గరచిన బూరె ప్రియమాయ బ్రదుకు | ॥అక్కడ॥ |


