అధ్యాత్మ సంకీర్తన
రేకు: 15-3
సంపుటము: 1-91
రేకు: 15-3
సంపుటము: 1-91
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| నాఁటికి నాఁడే నా చదువు మాటలాడుచును మఱచేటి చదువు | ॥నాఁటికి॥ |
| ఎనయ నీతని నెఱుఁగుటకే పో వెనకవారు చదివిన చదువు మనసున నీతిని మఱచుటకే పో పనివడి యిప్పటి ప్రౌఢల చదువు | ॥నాఁటికి॥ |
| తెలిసి యితనినే తెలియుటకే పో తొలుతఁ గృతయుగాదుల చదువు కలిగిన యీతనిఁ గాదననే పో కలియుగంబులోఁ గలిగిన చదువు | ॥నాఁటికి॥ |
| పరమని వేంకటపతిఁ గనుటకే పో దొరలగు బ్రహ్మాదుల చదువు సిరుల నితని మఱచెడికొరకే పో విరసపు జీవుల విద్యల చదువు | ॥నాఁటికి॥ |


