అధ్యాత్మ సంకీర్తన
రేకు: 182-4
సంపుటము: 2-413
రేకు: 182-4
సంపుటము: 2-413
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| ఇల జాణతనము లిన్నిటికిఁ గలదు తలఁపే కూళై తగిలీఁ గాని | ॥పల్లవి॥ |
| మఱవదు దేహము మహిఁ దన గుణములు గుఱి నాహారము గొనునెపుడు మఱవ నింద్రియములు మర్మస్థలములు మఱచితి నిను నేమరులో కాని | ॥ఇల॥ |
| చెదరదు కర్మము సేసినంతయును పొదిగి జీవమును భోగించును చెదరదు సంసారశీతలబంధము మదిఁ జెదరెడి నామరులేకాని | ॥ఇల॥ |
| తొలఁగవు మాయలు తొడరి ప్రపంచము కలవలెఁ బెనగొని కదిసీని బలు శ్రీవేంకటపతికృపచే నాకు తొలఁగె భవము లెటు దూరీనో మరులు | ॥ఇల॥ |


