అధ్యాత్మ సంకీర్తన
రేకు: 15-5
సంపుటము: 1-93
రేకు: 15-5
సంపుటము: 1-93
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాదరామక్రియ
| ఈ సుర లీ మును లీ చరాచరములు [1]యీ సకలమంతయు నిది యెవ్వరు | ॥ఈ సురలీ॥ |
| ఎన్నిక నామము లిటు నీవైయుండఁగ యిన్నినామముల వారిది యెవ్వరు వున్నచోటనే నీవు వుండుచుండఁగ మరి యిన్నిటాఁ దిరుగు వారిది యెవ్వరు | ॥ఈ సురలీ॥ |
| వొక్కరూపై నీవు వుండుచుండఁగ మరి తక్కిన యీ రూపములు తా మెవ్వరు యిక్కడనక్కడ నీవు యిటు ఆత్మలలోనుండ మక్కువ నుండువారు మరి యెవ్వరు | ॥ఈ సురలీ॥ |
| శ్రీవేంకటాద్రిపై చెలఁగి నీవుండఁగా దైవంబులనువారు తా మెవ్వరు కావలిసినచోట కలిగి నీ వుండఁగ యీ విశ్వపరిపూర్ణు లిది యెవ్వరు | ॥ఈ సురలీ॥ |
[1] ‘యీసకళ’ అని రేకు.


