అధ్యాత్మ సంకీర్తన
రేకు: 183-4
సంపుటము: 2-418
రేకు: 183-4
సంపుటము: 2-418
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| వీదిలోన నదేకదే విష్ణుపదము ఆ దెసనే పాయకుండు నాదిమూలము | ॥పల్లవి॥ |
| చూచేటి చూపులకును సూటియైన మొదలేదో యేచి వినుకలిమర్మ మెందు దాఁకీనో వాచవిచవులు చూచే వంటశాల చోటేదో ఆచాయనే వుండు నాదిమూలము | ॥వీది॥ |
| పూఁప తలపోఁతలకు పుట్టినయి ల్లది యేదో పైపై నూర్పులు నిలువఁగఁ జోటేదో మాపులు నిద్రించువేళ మరచేటి చోటేదో ఆపొరుగుననే వుండు నాదిమూలము | ॥వీది॥ |
| నేరిచిన విద్యలెల్లా నించి దాఁచేచోటేదో కోరని యానందముకొన యేదో ఆరయ శ్రీవేంకటేశుఁ డాడనే పాయక వుండు ఆరితేరి నాతఁడీతఁ డాదిమూలము | ॥వీది॥ |


