అధ్యాత్మ సంకీర్తన
రేకు: 16-1
సంపుటము: 1-95
రేకు: 16-1
సంపుటము: 1-95
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| ఏది జూచినఁ దమకు యిన్నియును నిటువలెనె వేదు విడిచిన కూడు వెదకినను లేదు | ॥ఏది॥ |
| ఏకాంతసౌఖ్యంబు లెక్కడివి ప్రాణులకు పైకొన్న దుఃఖముల పాలుపడెఁ(డి?) గాక యేకమగు పుణ్యంబు లేడఁగల విందరికి కైకొన్న దురితములు కలపాటిగాక | ॥ఏది॥ |
| హితవైన మమకార మెందుఁ గల దిందరికి ప్రతిలేని విరహతాపము కొలఁదిగాక మతిలోని వేడుకలు మరి యేవి మనుజులకు జితమైన దైవమిచ్చిన పాటిగాక | ॥ఏది॥ |
| యిరవైన దైవకృపయేల దొరుకునుఁ దమకు పరమైన కర్మంబు పరిపాటిగాక యెరవైన పెనుబంధ మేల వీడెడు నాత్మఁ దిరువేంకటేశుకృప తిరమైనఁ గాఁక | ॥ఏది॥ |


