అధ్యాత్మ సంకీర్తన
రేకు: 189-1
సంపుటము: 2-450
రేకు: 189-1
సంపుటము: 2-450
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ధన్నాసి
| అటుగాన మోసపోక హరి నీకే అన్నియును ఘటియించుటే యెక్కుడు కమలారమణ | ॥పల్లవి॥ |
| నిన్నుఁజూడని కన్నులు నీచువలకన్నులు చిన్ని నీకథవినని చెవులు రాట్నపుఁ జెవులు వున్నతి నీకడకు రాకున్న కాళ్లు మరగాళ్లు సన్నుతిసేయని జిహ్వ హరి నుపజిహ్వ | ॥అటు॥ |
| చేరి నిన్నుఁ బూజించని చేయి దంతెనపుఁజేయి తారి నీకు మొక్కనట్టి తలయే పెడతల సారె నీముద్రలేని భుజములు బుద్బుజములు తేరి నీదాస్యములేని దేహము సందేహము | ॥అటు॥ |
| వనమాలలున్న గ్రీవము కంబుగ్రీవము ఘన మిది దెలియుటే కైవల్యము యెనయ శ్రీవేంకటేశ ఇటు నన్ను నేలితివి అనుమానమెల్లఁ బాసె నన్నిటా నాకును | ॥అటు॥ |


