అధ్యాత్మ సంకీర్తన
రేకు: 189-4
సంపుటము: 2-453
సంస్కృతకీర్తన
రేకు: 189-4
సంపుటము: 2-453
సంస్కృతకీర్తన
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మలహరి
| పరమపురుష హరి పరమపరాత్పర పరరిపుభంజన పరిపూర్ణ నమో | ॥పల్లవి॥ |
| కమలాపతి కమలనాభ కమలాసనవంద్య కమలహితానంతకోటిఘనసముదయతేజా కమలామలపత్రనేత్ర కమలవైరివర్ణగాత్ర కమలషట్కయోగీశ్వరహృదయం తేహం నమో నమో(?) | ॥పర॥ |
| జలనిధిమథన జలనిధిబంధన జలధిమధ్యశయనా జలధియంతరవిహార మచ్చకచ్చపయవతారా జలనిధిజామాత జలనిధిశోషణ జలనిధిసప్తకగమన జలనిధికారుణ్య నమో తేహం జలనిధిగంభీర నమో నమో | ॥పర॥ |
| నగధర నగరిపువందిత నగచరయూథపనాథా నగపారిజాతహర సారసపన్నగపతిరాజశయన(?) నగకులవిజయ శ్రీవేంకటనగనాయక భక్తవిధేయా నగధీరా తేహం సర్వేశ్వర నారాయణ నమో నమో | ॥పర॥ |


