అధ్యాత్మ సంకీర్తన
రేకు: 191-2
సంపుటము: 2-463
రేకు: 191-2
సంపుటము: 2-463
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| ఇంతటా హరినేకాని యెందునను గాన నన్ను కొంత నాకుఁ దెలుపరో గురువులాల | ॥పల్లవి॥ |
| తనువూ హరియే తలఁపూ హరియే వినికి మనికియును విష్ణుఁడే కనుఁగొను చూపులు కమలనాభుఁడే యెనసి జీవునిశక్తి యేడనేడ నున్నదో | ॥ఇంత॥ |
| లోకమెల్ల మాధవుఁడే లోనెల్లఁ గేశవుఁడే వాకును కర్మము శ్రీవైకుంఠుఁడే చేకొని చైతన్యమెల్ల శ్రీనారాయణుఁడే యీకడ నే ననువాఁడ నేడ నుండువాఁడనో | ॥ఇంత॥ |
| వెనకను కృష్ణుఁడే వెస ముం దచ్యుతుఁడే కొనమొదలు నడుము గోవిందుఁడే యెనయఁగ శ్రీవేంకటేశుమయ మింతాను అనుగు నాస్వతంత్ర మది యేడనున్నదో | ॥ఇంత॥ |


