అధ్యాత్మ సంకీర్తన
రేకు: 191-5
సంపుటము: 2-466
రేకు: 191-5
సంపుటము: 2-466
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| కలిగె నిదె నాకు కైవల్యము తొలుత నెవ్వరికి దొరకనిది | ॥పల్లవి॥ |
| జయ పురుషోత్తమ జయ పీతాంబర జయ జయ కరుణాజలనిధి దయ యెఱంగ నే ధర్మము నెఱంగ నా- క్రియ యిది నీ దివ్యకీర్తనమే | ॥కలి॥ |
| శరణము గోవింద శరణము కేశవ శరణు శరణు శ్రీజనార్దన పరమ మెఱంగను భక్తి యెఱఁగను నిరతము నాగతి నీ దాస్యమే | ॥కలి॥ |
| నమో నారాయణ నమో లక్ష్మీపతి నమో పుండరీకనయనా అమిత శ్రీవేంకటాధిప యిదె నా క్రమమెల్లను నీకయింకర్యమే | ॥కలి॥ |


