అధ్యాత్మ సంకీర్తన
రేకు: 192-2
సంపుటము: 2-469
రేకు: 192-2
సంపుటము: 2-469
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగం
| నానాభక్తులివి నరుల మార్గములు యే నెపాననైనా నాతఁ డియ్యకొను భక్తి | ॥పల్లవి॥ |
| హరిఁకిఁగా వాదించు టది ఉన్మాదభక్తి పరులఁ గొలువకుంటే పతివ్రతాభక్తి అరసి యాత్మఁ గనుటదియే విజ్ఞానభక్తి అరమరచి చొక్కుటే ఆనందభక్తి | ॥నానా॥ |
| అతిసాహసాలపూజ అది రాక్షసభక్తి ఆతని దాసుల సేవే అదియే తురీయభక్తి క్షితి నొకపని గోరి చేసుటే తామసభక్తి అతఁడే గతని వుండుటది వైరాగ్యభక్తి | ॥నానా॥ |
| అట్టె స్వతంత్రుఁడౌటే అది రాజసభక్తి నెట్టన శరణనుటే నిర్మలభక్తి గట్టిగా శ్రీవేంకటేశు కైంకర్యమే సేసి తట్టుముట్టులేనిదే తగ నిజభక్తి | ॥నానా॥ |


