అధ్యాత్మ సంకీర్తన
రేకు: 193-1
సంపుటము: 2-474
రేకు: 193-1
సంపుటము: 2-474
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
| ఇంతటఁ బో కానవచ్చు నెక్కువ తక్కువలెల్ల దొంతి ఇంద్రియాలకెల్లఁ దొలఁగి వుంటేను | ॥పల్లవి॥ |
| మాటలాడవచ్చుఁ గాని మనసులు పట్టరాదు చాటువకెక్కినయట్టి సతులఁ గంటే కోటి చదువఁగవచ్చు కోపము నిలుపరాదు జూటరై వొకఁడు దన్ను సోఁకనాడితేను | ॥ఇంత॥ |
| అందరి దూషించవచ్చు నాసలు మానఁగరాదు కందువైన మించుల బంగారు గంటే అందాల మొక్కఁగవచ్చు హరిభక్తి సేయరాదు పొందుల సంసారపు భోగము గంటేను | ॥ఇంత॥ |
| మొదలఁ బుట్టగవచ్చు మోక్షముఁ బొందఁగరాదు పొదిగి పుణ్యరాసుల భోగము గంటే యెదుట శ్రీవేంకటేశ ఇదివో నీశరణంటే కదిసితి నిట్టే పో నీకరుణ గంటేను | ॥ఇంత॥ |


