అధ్యాత్మ సంకీర్తన
రేకు: 193-4
సంపుటము: 2-477
రేకు: 193-4
సంపుటము: 2-477
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ధన్నాసి
| ఒక్కమనసున నే నుండేఁగాక యెక్కడిపనులు దానే యెఱఁగఁడా | ॥పల్లవి॥ |
| బలుదేహ మిచ్చువాఁడు ప్రాణము వోసినవాఁడు తలఁపొసగినవాఁడు దైవమేకాఁడా వెలుపలి లంపటాలు వేవేలు గడించి తాను మలసి ఇంతలో నన్ను మఱచీనా | ॥ఒక్క॥ |
| జగము లేలేటివాఁడు సంసారిఁ జేసినవాఁడు తగులై యుండినవాఁడు తానేకాఁడా బెగడకుండ దినాలు పెరుగఁజేసేటివాఁడు తగినట్టు నడపించఁ దా నేరఁడా | ॥ఒక్క॥ |
| మొదలై యుండేటివాఁడు ముందరఁ దుదయ్యేవాఁడు యెదలోవాఁడు శ్రీవేంకటేశుఁడే కాఁడా చదివించి బుద్ధులిచ్చి చైతన్యమైనవాఁడు పొదిగి నాదాపుదండై భోగించఁడా | ॥ఒక్క॥ |


