అధ్యాత్మ సంకీర్తన
రేకు: 194-4
సంపుటము: 2-483
రేకు: 194-4
సంపుటము: 2-483
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
| కైవల్యమునకంటే కైంకర్య మెక్కుడు శ్రీవిభుఁడ నీవు మాకుఁ జిక్కే మర్మ మిదివో | ॥పల్లవి॥ |
| చేపట్టి నీశిరసు పూజించే అహమికకంటే నీపాదాలు పూజించే నేను మొక్కుడు మాపుదాఁకా నినుఁగొల్చి మందెమేళమౌకంటే దాపగు నీదాసుల శేషత్వ మెక్కుడు | ॥కైవ॥ |
| హరి నీపస్రాదజీవినై గర్వించుటకంటే నరయ నీదాసులలెంకౌ టెక్కుడు వెరవున నీచెవిలో విన్నపాలు సేయుకంటే ధర నీవూడిగకాండ్లఁ దలఁపించు టెక్కుడు | ॥కైవ॥ |
| జట్టి మిమ్ము ధ్యానించి సాయుజ్య మందుటకంటే అట్టె నీనామఫలమందు టెక్కుడు ఇట్టె శ్రీవేంకటేశ యేలితి విందువంకనే తిట్టపు మాగురు నుపదేశ మెక్కుడు | ॥కైవ॥ |


