అధ్యాత్మ సంకీర్తన
రేకు: 194-6
సంపుటము: 2-485
రేకు: 194-6
సంపుటము: 2-485
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| అదె శిరశ్చక్రము లేనట్టి దేవర లేదు యిదె హరిముద్రాంకిత మిందే తెలియరో | ॥పల్లవి॥ |
| ఆనాయుధో సో అసురా అదేవా యని వినోదముగ ఋగ్వేదము దెలిపెడి సనాతనము విష్ణుచక్రధారణకును అనాది ప్రమాణ మందే తెలియరో | ॥అదె॥ |
| యెచ్చ యింద్రే యని "యచ్చ సూర్యే" యని అచ్చుగ తుద కెక్కె(క్క?) నదే పొగడీ శ్రుతి ముచ్చట గోవిందుని ముద్రాధారణకు అచ్చమయిన ప్రమాణ మందే తెలియరో | ॥అదె॥ |
| మును "నేమినా తప్తముద్రాం ధారయే" త్తని వెనువెంట శ్రుతి యదె వెల్లవిరి సేసీని మొనసి శ్రీవేంకటేశు ముద్రాధారణకు అనువుగఁ బ్రమాణ మందే తెలియరో | ॥అదె॥ |


