| కీర్తనలు | దాసు శ్రీరాములు | అడవి ముష్ణికాయ - అది నీకు ప్రియమాయె - అయ్యో నే నేమందురా |
| ముఖారి - మిశ్రచాపు | |
| పల్లవి: | |
| అడవి ముష్ణికాయ - అది నీకు ప్రియమాయె - అయ్యో నే నేమందురా | ॥అడవి॥ |
| అనుపల్లవి: | |
| పడుచుతనము చేత - భ్రమజెందుటేగాని - పదరా నీలి వార్త | ॥అడవి॥ |
| చరణ: | |
| వింత వింతల మారి - సంతమెరుగులాడి - తంతర గొట్టుదిరా సంతోషమున దాని - సరస జేరుటేగాని ఇంతి మంతనములు - యెండమావుల నీళ్లు | ॥అడవి॥ |
| చేసితివౌ లేర - చెలియతో స్నేహము - చేతి సంచి వెచ్చము ఆసచేత దాని - నంట బోవుటేకాని కాసు చేయదు వట్టి - కట్టు గారడి సామి | ॥అడవి॥ |
| కోప మెంచకు తోట్ల - వల్లూరి శ్రీవేణుగోపాలా బాగాయెరా శ్రీపూర్ణుడగు దాసు - శ్రీరామకవి వాక్య వ్యాపారములు వే - దాక్షరములు నమ్ము | ॥అడవి॥ |