| కీర్తనలు | దాసు శ్రీరాములు | తగు తగులేరా చిన్న - దాన తాళజాలరా, నా |
| హిందూస్థాని కాఫి - రూపకం/త్రిశ్రగతి | |
| పల్లవి: | |
| తగు తగులేరా చిన్న - దాన తాళజాలరా, నా తోను పంతమేలరా యిం - తైన నిల్వలేనురా | ॥తగు॥ |
| చరణ: | |
| నను గరుణింపవేర - న్యాయమరసి చూడరా, నా మీద కోపమేలరా నీ - కేల రవ్వ మానరా | ॥తగు॥ |
| కోమలమగు నాదు వయసు - కోన వెన్నెలాయెరా, నా గుట్టు బయలు బట్టెరా - నా కోరిక లీడేర్చరా | ॥తగు॥ |
| వేసకాడ ముద్దుసామి - వేణుగోపబాలకా, శ్రీ దాసురామపాలకా నా - పాలి పంచనాయకా | ॥తగు॥ |