| కీర్తనలు | దాసు శ్రీరాములు | తెలియదే తెలియదే - తెలియదే మాయ |
| కాఫి - ఆది | |
| పల్లవి: | |
| తెలియదే తెలియదే - తెలియదే మాయ | ॥తెలియదే॥ |
| అనుపల్లవి: | |
| వలపు సొలపులో - వాని గుణమేమొ కాని | ॥తెలియదే॥ |
| చరణ: | |
| వలపించుటే కాని - వలచుటలేదే దాని కలనైన మరువడే - కానిపని చేసినాడే | ॥తెలియదే॥ |
| చెలియరో నే మందు - బలమగు దానిమందు తల కెక్కెనేమో అందు - వలన రాడే యిందు | ॥తెలియదే॥ |
| వేమరు ననుగూడి రాడు - వింతమాట లాడినాడు భామరో దాసు శ్రీరామ - పాలుడే గోపాలుడే | ॥తెలియదే॥ |