| కీర్తనలు | దాసు శ్రీరాములు | దయలేక నీవురాక యున్న - తాళ జాలరా |
| కాఫి - రూపక | |
| పల్లవి: | |
| దయలేక నీవురాక యున్న - తాళ జాలరా | ॥దయలేక॥ |
| చరణ: | |
| నిన్నరేయి కన్నులార - నిదుర లేదురా వన్నెకాడ నిదురలేక - వాచియుంటిరా | ॥దయలేక॥ |
| ఉత్తమాటగాదు నిన్నె - గుత్త గొంటిరా చిత్తగించు నాదు మనవి - చిత్తగించరా | ॥దయలేక॥ |
| శ్రీసఖా నే జేసుకొన్న - దోస మేమిరా వాసిమీర దాసురామ - దాసు నేలరా | ॥దయలేక॥ |