| కీర్తనలు | దాసు శ్రీరాములు | నే గననా సామి - నే గననా |
| కాఫి - చాపు | |
| పల్లవి: | |
| నే గననా సామి - నే గననా శ్రీగల వాడవు నీవని - చిన్నతనము సుందరుండవని కౌగిట నేను బదినాలుగు విధముల - గరడీలు గరపినది | ॥నే॥ |
| చరణ: | |
| వేడుక కాడవు నీవని - వీధిలో నినుగని పోకుమని కోడెకాడ రారమ్మని - కోడిగము లాడినది | ॥నే॥ |
| చక్కని వాడవు నీవని - చనవుగలదు వెరపేమి యని చక్కిలి గింతలు గొలుపుచు మోవి చు - రుక్కున నొక్కినది | ॥నే॥ |
| వాసిగ వల్లూరి వాసుడని - భాసుర వేణుగోపాలుడని దాసు రామకవిపాలుడని దర - హాసము జేసినది | ॥నే॥ |