| కీర్తనలు | దాసు శ్రీరాములు | పాట బాడెద రార సామి - పరమానందమురా, నాసామి |
| సురటి - రూపకం | |
| పల్లవి: | |
| పాట బాడెద రార సామి - పరమానందమురా, నాసామి బ్రహ్మానందమురా నాసామి - పరమానందమురా | ॥పాట॥ |
| చరణ: | |
| మదన జనక నీదు దయ - మదినిగోరి యున్నదాన ముదముమీర ముచ్చటాడి - ముద్దుబెట్టరా, నాసామి ముద్దుబెట్టరా నాసామి | ॥పాట॥ |
| వలపు నిలుప లేదురా - వగలుమాని యేలుకోర కళలుదేర నొక్కసారి - కౌగిలించరా, నాసామి కౌగిలించరా నాసామి | ॥పాట॥ |
| వనజనయన నిశ్చలా - వరద వేణుగోపబాల ఘనుడ దాసు రామపాల - కాంక్షదీర్చరా, నాసామి కాంక్షదీర్చరా నాసామి | ॥పాట॥ |