| కీర్తనలు | దాసు శ్రీరాములు | మొట్టమొదట - నట్టనడుమ |
| జంఝాటి - రూపకం | |
| పల్లవి: | |
| మొట్టమొదట - నట్టనడుమ తుట్ట తుదియు - నెరుగనే ఇట్టెవచ్చి విభుడు రాత్రి - ఏమిపనులు చేసెనే | ॥మొట్ట॥ |
| చరణ: | |
| మోము మోము గదియ విభుడు - ముద్దుపెట్టి నంతలో భామ యేమొకాని నేను - పరవశమై యుంటినే | ॥మొట్ట॥ |
| అట్టె విభుడు చన్నుదోయి - బట్ట వచ్చినంతనే యెట్టి మాయయేమొ నాదు - హృదయ మైక్యమయ్యెనే | ॥మొట్ట॥ |
| భాసుర శ్రీవేణుగోప - బాలుడంటినంతనే దాసురామదాస చిత్త - వాసి యనుకొంటినే | ॥మొట్ట॥ |