| కీర్తనలు | దాసు శ్రీరాములు | రమణిరో సముఖాన - రాయబార మేటికే |
| కానడ - రూపకం | |
| పల్లవి: | |
| రమణిరో సముఖాన - రాయబార మేటికే నిమిషమైన తాళలేనె - నేనె వాని రమ్మందునె | ॥రమణిరో॥ |
| చరణ: | |
| కడువేడుక వానిమేన - గంధమును బూసి యాకు మడుపులిచ్చి తడవేటికి - మాపటికి రమ్మందునె | ॥రమణిరో॥ |
| కోరివానిజేరి ప - న్నీరుజల్లి నన్ను వేరుసేయ మేరగాదు - వేవేగ రమ్మందునె | ॥రమణిరో॥ |
| భాసురాంగి వేణుగో - పాల యింత పంతమేల దాసు రామకవి సన్నుతి - జేసె నిక రమ్మందునె | ॥రమణిరో॥ |