| కీర్తనలు | దాసు శ్రీరాములు | వనితరో యీ వన్నె - లేలనే ఈ వేళనాకు |
| ఆనందభైరవి - రూపకం | |
| పల్లవి: | |
| వనితరో యీ వన్నె - లేలనే ఈ వేళనాకు తనువేల తరుణులేల - ధనమేల ధామమేల | ॥వనిత॥ |
| చరణ: | |
| ఆకులేల పోకలేల - అన్నమేల పానమేల శ్రీకరుండు రాకయుండి - ఆశలుడిగి యున్నవేళ | ॥వనిత॥ |
| సొగసేల సొమ్ములేల - అగరేల గంధమేల మగనికి దయలేక మేను - సగమై యున్నట్టివేళ | ॥వనిత॥ |
| భాసురాంగి తోటలేల - పాటలేల ఆటలేల దాసు రామ పాలు బాసి - ఆసలుడిగి యున్నవేళ | ॥వనిత॥ |