| కీర్తనలు | దాసు శ్రీరాములు | చల్లకు వచ్చి ముంత దా - చ నేలనే ఓమధురవాణీ |
| బేగడ - రూపకం | |
| పల్లవి: | |
| చల్లకు వచ్చి ముంత దా - చ నేలనే ఓమధురవాణీ | ॥చల్లకు॥ |
| అనుపల్లవి: | |
| ముల్లెకు మోసము లేదు - ముద్దు బెట్టి పొమ్మనే | ॥చల్లకు॥ |
| చరణ: | |
| వల్లభ నీవంటి వాని - వలచి వచ్చిన వనిత నేచ చెల్లదురా తగదు దగదని - చెయ్యి బట్టి రమ్మనె | ॥చల్లకు॥ |
| వానికెదురు చూచుచు - వాకిటనే నిలచితినే చాన యేమొకాని యన్న - పానమునే మరచితినే | ॥చల్లకు॥ |
| వేసట జెందితిగదవే - వేణుగోపాలుని దేవే దాసు రామ కవి హృదయ ని - వాసుని దయచేయుమనే | ॥చల్లకు॥ |