| కీర్తనలు | దాసు శ్రీరాములు | తత్తర పడనేల - తాళు తాళురా సామి |
| కల్యాణి - మిశ్రచాపు | ||
| పల్లవి: | ||
| తత్తర పడనేల - తాళు తాళురా సామి అత్తింటి కోడలరా | ॥తత్తర॥ | |
| అనుపల్లవి: | ||
| కొత్తగా నేవచ్చి - కొన్ని నాళ్లాయెరా పొత్తుగడియ మరచి - పోరు మా వారు చిత్తమున నేరమెంచకురా - చీకటి వేళగాదురా అత్తవారింట లేకున్నపు - డైన రావైతివిర సామీ | ॥తత్తర॥ | |
| చరణ: | ||
| మక్కువ చెక్కిలి - నొక్కరాకురా సామి | - నొక్కు లెక్కడ దాతురా అక్కడ నున్నది - అదిగో యాడు బిడ్డ ఇక్కథ లెరిగిన - నెగిరి పైబడు సామి నిక్కముగ నీకె దక్కితిరా - నేటి మాపటికి రాపోరా పక్కనే పంచాది గది వెల - పటి తలుపు మూయకుంచెదరా | ॥తత్తర॥ |
| కౌగిటి కిది వేళ - గాదురా నీకింత | - కక్కుర్తి పని యేమిరా బాగు బాగు రవిక - బట్టి నీగోళ్ళతో లాగిన పికిలె నే - లాగు బొంకెదురా కాగలదురా నీవు కోరిన - కార్యమది యొక జాములోపన రాగదుర మాపటికి మా లో - గిటికి పడమటి కిటికి దారిని | ॥తత్తర॥ |
| వల్లగాదుర తోట్ల - వల్లూరి వేణుగో | - పాల తగదు తగదురా చల్లని పన్నీరు - చల్లి యత్తరు దేహ వల్లి బూసెదు మూయ - వశమా వాసనలు సల్లలిత దాసు రాముని కృతి - నుల్లసిల్లితివిరా మది మన మల్లగుంతలె వారు చూచిన - నల్లరికి మూలమగు సామి | ॥తత్తర॥ |