| కీర్తనలు | దాసు శ్రీరాములు | నా సామి నీకిది - న్యాయమా న్యాయమా |
| అఠాణ - ఆది | |
| పల్లవి: | |
| నా సామి నీకిది - న్యాయమా న్యాయమా నా సాటివారిలో - నగుబాటు లాయెరా | ॥నా సామి॥ |
| చరణ: | |
| సుందరాంగ నిను - జూచినప్పటి నుండి ఇందన్నము నిద్ర - నేనెరుగ నన్నేలరా అందరాని మ్రాని పండ్ల - కాసించి నట్లాయె బ్రతు కెందుకిక నా - యందు దయ రాదేమిరా | ॥నా సామి॥ |
| పాటలాధర నిన్ను - పటమున వ్రాసుక మాటి మాటికి తమి - నాటి చూచుకొనుచు కాటుక కన్నుల వెంట - దీటుగా జారు కన్నీట మీటిన విచ్చు గుబ్బలపై - శాటి దడిసె నీ కేటిమాటలు | ॥నా సామి॥ |
| వర తోట్ల వల్లూరి - వాసా వేణుగోపాలా స్థిర శీల ఘన దాసు - శ్రీరామకవి పాల కరుణలేదాయె నాపై - మరుబారి కోర్వగలనా సురత సుఖమున నరసి ప్రోవర - చరణములకే శరణుజొచ్చెద | ॥నా సామి॥ |