| కీర్తనలు | దాసు శ్రీరాములు | మూట లడిగితినా - ముల్లె లడిగితినా |
| యదుకుల కాంభోజి - త్రిపుట | |
| పల్లవి: | |
| మూట లడిగితినా - ముల్లె లడిగితినా మూతి త్రిప్పెద వేమిరా - ముద్దిడరా మోము త్రిప్పెదవేమిరా | ॥మూట॥ |
| అనుపల్లవి: | |
| నోటి మాటకైన - నోచుకో నైతినా కూటములా ముద్దు - కోమలి పాలైన | ॥మూట॥ |
| చరణ: | |
| త్యాగశీలుడ వీవు - దాచిన సొమ్మంత వేగ నాకిమ్మంటినా బాగాలివ్వనైన - పనికి రానైతినా బాగాయె నది యెంత - బంగారు బొమ్మైన | ॥మూట॥ |
| వడిగ నే నీ పాన్పు - వద్దకు జేరగ వద్దు వద్దన నేలరా అడుగులొత్తగ నైన - అనుకూల పడరాదా పడతి బోధన లిహ - పర సాధనములైన | ॥మూట॥ |
| పాలించు శ్రీ తోట్ల - వల్లూరి వేణుగో పాలా మ్రొక్కితి మ్రొక్కితి శ్రీల మించిన దాసు - శ్రీరామ కవి కృతి వాలాయముగ నిన్ను - వర్ణన జేసిన | ॥మూట॥ |