| కీర్తనలు | దాసు శ్రీరాములు | వలచితిరా నిను - వదలను సామీ |
| దర్బారు - చాపు | |
| పల్లవి: | |
| వలచితిరా నిను - వదలను సామీ జలజాక్ష నీ ద - ర్శనమే పదివేలు | ॥వలచితి॥ |
| చరణ: | |
| ఇచ్చిన సరే - ఇవ్వకున్న సరే వచ్చి నాతో నొక - ముచ్చటాడిన చాలు | ॥వలచి॥ |
| నీళ్లనే ముంచు - పాలనే ముంచు కాళ్లకు మ్రొక్కెద - కరుణించరా | ॥వలచి॥ |
| వేణుగోపాలా - వేడితి చాలా రాణించు దాసు శ్రీ - రాము నుల్లము వలె | ॥వలచి॥ |