| కీర్తనలు | స్వాతి తిరుణాళ్ | మఙ్గళం - మాతఙ్గతనయాయై మఙ్గళం |
| పన్తువరాళీ - ఆది |
| పల్లవి: |
| మాతఙ్గతనయాయై మఙ్గళం |
| అనుపల్లవి: |
| భూయో మనసిజారికన్తాయై మఙ్గళం |
| చరణము(లు): |
| బహులకుఙ్కుమ పఙ్కపాటలిత కుచాయై మహిషాసుర హారిణ్యై మఙ్గళం ॥1॥ |
| కరిరాజ గమనాయై వరతాప సమఞ్చయ- స్మరణీయ చరణాయై మఙ్గళం ॥2॥ |
| వరనదీ తటగాయై వనజనాభానుజాయై మరకత మేచకాఙ్గ్యై మఙ్గళం ॥3॥ |