| కీర్తనలు | స్వాతి తిరుణాళ్ | నవరాత్రి కీర్తనము (మొదటి రోజు) - దేవి జగజ్జనని దేహి కృపయా మమ |
| శఙ్కరాభరణం - ఆది |
| పల్లవి: |
| దేవి జగజ్జనని దేహి కృపయా మమ తావకచరణభక్తిమ్ |
| అనుపలవి: |
| దేవ మకుటమణి దేదీప్యమాన పాదే కేవలానన్దపూర్ణే కీరసువాణి వాణి |
| చరణము(లు): |
| వీణాపుస్తక రఞ్జిత కరతలవిహసిత కుఞ్జవరేమ్బికే వేణీమఞ్జిమపుఞ్జ వినిర్జిత వితత ఘనాఘనమాలికే ఏణీమద వినివారణ నిపుణతరేక్షణ హృతనతపాతకే శాణోల్లీఢ మహామణిభూషణ శాలిని బుధజనపాలికే ప్రీణితమునిగేయే ద్రుహిణజాయే పరమమేయే నిరపాయే ॥1॥ |
| సకలకలాలయ శారద హిమకర సదృశవిలాస యుతాననే మకరవరాఙ్క శరాసనమౌర్వి మహితతరాళక మోహనే శుకసనకాది మునీశ్వరవిరచిత సున్దరపదయుగ పూజనే వికతజటా లసితేన్దుకలాపిని విమలసరోజ వరాసనే వికచకమలపాదే విహతభేదే నిహతఖేదే భృతమోదే ॥2॥ |
| జ్యోతిర్మయ నవహారాయిత సజ్జ్యోతిష తన్త్రవిభూషితే మాతర్మేదుర మీమాంసాగమమాంసిళితోరు యుగాఞ్చితే చేతోహరతర శబ్దాగమ కాఞ్చీలతికా గుణశోభితే పాతకహర పాద్మాదిపురాణ పాదితపాణి విరాజితే వీతశమలహృద్యే కలితవిద్యే త్రిజగదాద్యే నిరవద్యే ॥3॥ |
| అరుణతరాధర పరిలసదతి మృదుహసిత ద్యుతిపటలోజ్జ్వలే శరణసమాగత జనపరిపాలన సతతోద్యత కరుణాకులే పరిజనవిరచిత నవరాత్రోత్సవ పరితోషిత హృదయామలే కురు కరుణామయి భజనపరే మయి కున్దముకుళరదనే తులే భూరిశుభకరాణి అఘహరాణీ నుతిపరాణి కరవాణి ॥4॥ |