| కీర్తనలు | స్వాతి తిరుణాళ్ | నవరాత్రి కీర్తనం 2 (రెండవ రోజు) - పాహి మాం శ్రీవాగీశ్వరి పాహి భువనేశ్వరి |
| కల్యాణి - ఆది |
| పల్లవి: |
| పాహి మాం శ్రీవాగీశ్వరి పాహి భువనేశ్వరి |
| అనుపల్లవి: |
| దేహి తావకదయామయి భారతి దేహి బోధసుఖదాయికామిహ మోహభార తిమిర సఞ్చయామృత- మూర్తి మమలబుధ లోకవిలసిత- మోహనీయ కటకాఙ్గద భూషిత- ముగ్ధగాత్రి తుహినాంశు వతంసిని బాహులాలసిత పుస్తక జపవట- బన్ధురాభయవరే పరచిన్మయి |
| చరణము(లు): |
| శారదే కచపాశ విడంబిత రుచిరతరాసిత నీరదే నిజపతీ కమలజ నిరుపమతర సుఖకరణ విశారదే స్ఫుటతర ధవళమవిలసిత ముకురశకల పటలీరదే వినుతనారదే దారుణాధికర పాతకావళి దారణైకనిరతే సుభాషిణి సారస గర్భదళాయత లోచనపూరిత భక్తమనోరథవల్లరీ వారణకుంభ మదాపహ కుచయుగ- భార వినమ్ర కృశోదరి మామక- కర పద ముఖ సమకరణ నికరమపి చరణయుగ భజనపరమిహ కురు తవ ॥1॥ |
| శ్యామలే బహళాగరు చన్దనమృగమద ఘుసృణ పరిమళే పరిహృత పద నతపరిజన సముదయ నిఖిలమనోమలే శతముఖ ముఖసురవర పరిణుత బహువిధ చరితేఽమలే మధురకోమలే సామజాధిప మరాళికాగతి చారుమన్దగమనే సుహాసిని మామక మానసతాప సమూహ విరామమతీవ విధాతుమయే పద- తామరస ద్వయ మనుకలయే హృది తామసదోష విలాసిని రాసిని సముదయదవికల హిమకరరుచిమద- శమన కరణ పటువిమల హసితముఖి ॥2॥ |
| భాసితే శుకశౌనకకౌశిక ముఖముని పరిషదుపాసితే సహృదయ రసకర కవివరనికర హృదయకమలాసితే శ్రుతియుగ పథపథికనయన పరిలసదరుణ సితాసితే కుసుమవాసితే భాసమాన నవరాత్రికోత్సవ భావుకోపచితి మోదశాలిని భాసుర సారసనాఞ్చిత రత్నవిలాసిత విశేషవినిర్జిత శక్ర శ రాసరుచే సకలాగమరూపిణి దాసమిమం కృపయా శిశిరీకురు వస మమ సుఖమధిరసన మనవరతం అసదృశ విలసిత విసరమయి జనని ॥3॥ |