| కీర్తనలు | స్వాతి తిరుణాళ్ | నవరత్రి కీర్తనం 3 (మూడవ రోజు) - దేవి పావనే సేవే చరణే తే బుధావనే |
| సావేరి - ఆది |
| పల్లవి: |
| దేవి పావనే సేవే చరణే తే బుధావనే |
| అనుపల్లవి: |
| భావుకదాయి కటాక్షవిలాసిని భారతి దేహి సదా కుశలం భువనేశ్వరి |
| చరణము(లు): |
| సోమబింబ మదహర సుముఖి భక్తజనాఖిల- కామిత దాననిరతే కాన్త కున్దదన్తి భీమాఽనన్తాజ్ఞాన తిమిరభేదన మిహిరాయితే మామక హృది విహర మాన్యగుణావాసే సామజ పుఙ్గవ చారుగతే సుర- సాధ్యనుతే విమలే వరదే భువనేశ్వరి ॥1॥ |
| వారిదనిభచికురే వాసవోపలనయనే మారశరాసన రుచిచోరచిల్లికాన్తే సారసకృతనిలయే జాంబునద మయభూషే నారదాదిముని నుతనామ సముదాయే భూరి మనోజ్ఞ కరాఞ్చితవీణా- పుస్తకభాసిని చారుహాసే భువనేశ్వరి ॥2॥ |
| పాతిత దితిసుతే శ్రీపద్మభవవిలాసిని వీతపాప జనగేయవిభవే విద్యారూపే చాతకో జలదమివ సాదరమాశ్రయామి త్వాం ప్రీతిం మయి కురు లోకమాతరయి నిత్యం ధూతమలం కురు మాం సదయే పరి- పోషితసూరిగుణే శుభదే భువనేశ్వరి ॥|3॥ |