| కీర్తనలు | స్వాతి తిరుణాళ్ | నవరాత్రి కీర్తనం 4 (నాల్గవ రోజు) - భారతి మామవ కృపయా నతజనార్తి |
| తోడి - ఆది |
| పల్లవి: |
| భారతి మామవ కృపయా నతజనార్తి- భార హరణనిరతయా |
| అనుపల్లవి: |
| శారద విధుమణ్డల సదృశ మనోహరముఖి |
| చరణము(లు): |
| వాసవాది సురవినుతే తరణిసత- భాసుర భూషణలసితే హాసజిత కున్దవితతే విమలముక్తా- హారకణ్ఠి గజేన్ద్రగతే దాసభూతజన విద్యాదానలోలే పరదేవి భాసుర చన్దనమృగ మద కుసుమ సు- వాసితగాత్రి సుపావనశీలే ॥1॥ |
| నారదాది మనోనిలయే భువనత్రయ- నాయికే కృతాజ్ఞానిలయే చారుబాహు ధృతవలయే వికచ- సారసాక్షి తోషితభూవలయే మారకార్ముఖ సుషమాచోరచిల్లియుగే వాణీ వారిజభవదయితే వరవీణా- వాదనలోల కరాఙ్గుళిజాలే ॥2॥ |
| సకలాగమమయరూపే నిఖిలలోక- జనని సుధామధురాలాపే అకలఙ్క గుణకలాపే కరుణారస- హతవివశ జనవిలాపే సకలే పద్మనాభ సరసిజ సేవకవర- శుకసనకాది మునీశ్వరవినుతే సోమకలా సదృశామలఫాలే ॥3॥ |