| కీర్తనలు | స్వాతి తిరుణాళ్ | నవరాత్రి కీర్తనం 5 (అయిదవ రోజు) - జననీ మామవామేయే భారతి జయ |
| భైరవి - చాపు |
| పల్లవి: |
| జననీ మామవామేయే భారతి జయ సరసిజాసన జాయే |
| అనుపల్లవి: |
| అనుపమిత కమలావాసే చారుహసిత కృతకన్దనిరాసే దేవి మునివరేడిత విమలచరితే మోహనీయ గుణౌఘభరితే |
| చరణము(లు): |
| తరుణవారిద నిభవేణి దేవతరు కిసలయోపమపాణి కలిత వరదాభీతిముద్రే కల్యాణి పూర్ణశరదిన్దు సమకాన్తే వాణీ సురుచిరనయన జితైణి పరమకరుణారస శిశిరవేణి చరణగత జనభరణనిపుణే పరమామృత మధురభాషిణి ॥1॥ |
| ఘనసార తిలకాఙ్కితఫాలే అతికమనీయ విశదదుకూలే వినత- జనవిద్యా వితరణలోలే సాధుస్మరణీయ తమపాదమూలే కనకభూషణే శుభశీలే సర్వాగమమయి సుజనానుకూలే నానాముని మనోమయ వనజనిలయే వినిహతాశ్రిత వివిధశమలే ॥2॥ |
| పరిహృత ఘనాజ్ఞానఖేదే కృతపద్మనాభ సేవకమోదే సతత పరిచితవీణానినాదే మమ కురు మతిమయి తవ పాదే సురగణ మహితవినోదే శీతకరపోతధరే సదా సరసీరుహముఖి సపది వదనే సరసమిహ వస సకలవరదే ॥3॥ |