| కీర్తనలు | స్వాతి తిరుణాళ్ | నవరాత్రి కీర్తనం 6 (ఆరవ రోజు) - సరోరుహాసనజాయే భవతి సామోద మంబ నమామి |
| పన్తువరాళి - ఆది |
| పల్లవి: |
| సరోరుహాసనజాయే భవతి సామోద మంబ నమామి |
| అనుపల్లవి: |
| పురన్దరాది సురోత్తమసురుచిరకిరీట- మణికిరణాఞ్చిత చరణే |
| చరణము(లు): |
| యామినీశ మనోజ్ఞతమ రుచిభ్రమ మదవినివారణ పటుసిత తామరస మృదుకోటరవాసిని సామజరాజ సదృశగమనే కామమఞ్జు శరాసన నిరుపమకాన్తి హరచిల్లిచలననిహత- భీమనిబిడాజ్ఞానమలే సులలామ శోభిఫాలతలే వర- హేమ చారుభూషణలసితే మదహీన మౌనిహృదయైకపదే సుర- భామినీ నివహగీతగుణే శశిధా మమన్దహసితే జయ భగవతి ॥1॥ |
| మఙ్గళావర శాలివీణాసఙ్గికర మృదులాఙ్గుళి దలజిత- తుఙ్గకల్పక కిసలయ నివహే దురిత సేవక తాపభరే భృఙ్గసఞ్చయ వలయిత సుమ సురభీకృత ధమ్మిల్ల రచిత మద- భఙ్గ సజలామ్భోదకులే నవపఙ్కజోపమ నయనయుగే లస- దఙ్గరాగ ఘనసార హరిణమదహారభాసి కుచకుంభయుగే హరి- పుఙ్గవోపమిత మధ్యతలే పరబోధరూపిణి పరే జగదీశ్వరి ॥2। |
| బాలచన్ద్రవతంసిని పరిజనపాలనైకపరే ఘనపాతక- శైలభిధురాయిత చరితే కరుణాలవాలాయిత హృదయే లోలరుచిరాళక పరివృత సువిశాల నిటిలాయిత వదనే నాలమిహ ఫణినాయకోపి బతాలపితుమయి మహిమానం తే న్తూలతాం నయ మమోద్యదవిద్యాజాలమాశు నను భారతి సకలం ఫాలలోచన ముఖాఖిలవన్దిత పద్మనాభ పదసేవకనిరతే ॥3॥ |