| కీర్తనలు | స్వాతి తిరుణాళ్ | నవరాత్రి కీర్తనం 8 (ఎనిమిదవ రోజు) - పాహి జనని సన్తతం మామిహామలపరిణత |
| నాట్టకురఞ్జి - చాపు |
| పల్లవి: |
| పాహి జనని సన్తతం మామిహామలపరిణత- విధువదనే |
| అనుపల్లవి: |
| దేవి సకలశుభదే హిమాచలకన్యే సాహసికదారుణ చణ్డముణ్డనాశిని |
| చరణము(లు): |
| బాలసోమధారిణీ పరమకృపావతి నీలవారిద నిభనేత్రే రుచిరశీలే ఫాలలసిత వరపాటీరతిలకే శ్రీ- నీలకణ్ఠదయితే నిగమవనమాతఙ్గి ॥1॥ |
| సురభికుసుమ రాజిశోభిత కచబృన్దే వరదే వాసవముఖ వన్ద్యమానచరణే అరుణజపా కుసుమాధరే కౌముది- పరమోజ్జ్వలహసితే భక్తకల్పలతికే ॥2॥ |
| కమనీయతమరూపే కన్యాకుబ్జవాసిని శమితపాపనికరే శాన్తహృదయగేహే అమితవిమలరుచిహారే నీల వారిదోపమవేణి శ్రీపద్మనాభసోదరి ॥3॥ |